ఆత్మహత్యలు సమస్యలకి పరిష్కారం కాదు.
ఒక వ్యక్తి తనకి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని తనకి ఇంకా బ్రతికే ధైర్యం లేదని ఆత్మహత్య చేసుకోడానికి ఒక పర్వతం పైకి ఎక్కుతూ ఉంటాడు. దారిలొ అలసిపోయి ఒక దేవతా విగ్రహం వద్ద కూర్చుని విశ్రాంతి తీసుకుంటాడు. ఇంతలో అతనికి ఏవో మాటలు వినిపిస్తాయి. ఆ దేవతా విగ్రహం ఇంకా ఆ విగ్రహం ముంధు ఉన్న ఒక రాయి మాట్లడుకుంటూ ఉంటాయి.
రాయి దేవతా విగ్రహంతో, 'నీ భక్తులు ఈ మధ్య చాలా ఎక్కువ అయ్యారు. రోజూ చాలా మంది నిన్ను దర్శించుకోడానికి వస్తున్నారు. అలా వచ్చిన ప్రతివారు కొబ్బరికాయను నా మీద కొట్టి నన్ను పాతాళంలోకి తోసేస్తున్నారు, ఈ బాధను భరించలేకపొతునా ' అంటుంది.
దానికి ఆ దేవతా మూర్తి, " చూడు మిత్రమా! మొదట నువ్వు నేను కూడ రాళ్ళమే, ఒక శిల్పి వచ్చి మొదట నిన్ను దేవతా మూర్తిలాగా చెక్కుతాను అంటే ఒక రెండు ఉలి దెబ్బలు తిని ఇంక నా వల్ల కాదు అని ఆ శిల్పికి నన్ను చూయించి శిల్పాని చేయమన్నావు. నేను ఆ శిల్పి కొట్టిన ఉలి దెబ్బలను భరించి ఇదిగో ఇలా దెవతా మూర్తిని అయ్యాను. ఎలాగో నువ్వు ఖాలీగా ఉన్నావు అని నిన్ను నా ముందు కొబ్బరికాయలు కొట్టే రాయి లాగా వాడుతున్నారు. నువ్వు ఆ రోజు కొట్టిన కొన్ని ఉలి దెబ్బలను భరించి ఉంటే ఈ రోజు నా లాగా పూజలు అందుకునే దానివి. కాని ఆ రోజు నువ్వు బరించలేని ఆ దెబ్బల్ని, ఆ బాధని, ఈ రోజు నీకు ప్రతి ఒకరు, ప్రతి రోజు కలిగిస్తునారు."
దానికి రాయి, " అవును నిజమే! కష్టాలు వచ్చాయి కదా అని కుంగిపోతే జీవితం ఇంకా కష్టాల మయం అయిపోతుంది. అదే ఆ కష్టాల్ని బరిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది" అని నిట్టూరుస్తుంది.
ఇది విన్న ఆ వ్యక్తి వెంటనే ఆ దేవతా విగ్రహానికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయి తన జీవితాన్ని ఓర్పుగా, సహనంగా, ధైర్యంగా జీవిస్తాడు.
ఆత్మహత్యలు సమస్యలకి పరిష్కారం కాదు, ఆత్మవిశ్వాసంతో సమస్యల్ని ఓడించి ముందుకు నడవాలి.
Comments
Post a Comment