నాన్న...

నాన్న...
=======
సుఖ దుఃఖాలకు చిరునవ్వుతో కరచాలనం చేసే స్థిథప్రజ్ఞత నువ్వు

విలువలకు విలువనిచ్చిన మహోత్కృష్ఠి నువ్వు

అంతరాత్మను అందలమెక్కించిన ఆత్మవిశ్వాసం నువ్వు

సిద్ధాంతాల ఉనికికై నిలిచిన నిలువెత్తు ధైర్యం నువ్వు

రాలే ఆకుల సడికి సైతం చలించిపోయే సున్నితత్వం నువ్వు

వర్షపు చినుకుల మధ్య కేరింతలు కొట్టే అమాయకత్వం నువ్వు

హిమబింధువులను హారాలు చేయాలనుకునే సృజనాత్మకం నువ్వు

పసిపాపల నవ్వుల స్వచ్చత నువ్వు

మృత్యుపాశంలో చిక్కిన ఎందరికో జీవం పోసిన అమృతం నువ్వు

విజయాల స్వైరవిహారాల మధ్య అహంకారాన్ని తునాతునకలు చేసిన శౌర్యం నువ్వు

ప్రతి ఆత్మలో నిన్ను పోల్చుకునే అద్వైతం నువ్వు

నిను కబళించిన మృత్యువును పునీతం చేసిన పుణ్యాత్మ నువ్వు

శరీరాన్ని వదిలి ఆత్మను అమరం చేసిన దధీచి నువ్వు

ఎన్ని జన్మల పుణ్యఫలమో
నీ అంశం నేను.

Comments

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం