మారడం మరచిన మనిషి

*💎మారడం మరచిన మనిషి💎*
*🚦మనిషినే మరచిన మనసు🚧*

*⌛ఏమి మారెను...ఏమి మారెనురో..⏳*
      *🎍ఈ మనసున్న మనీషి..🎍*

*🤷🏻‍♀సొంత అన్నదమ్ములు తల్లిదండ్రులతోనేమో ఒకే ఇంట్లో కుటుంబంగా ఉండలేడు.*
*🙋🏻‍♂కాని అపార్ట్ మెంట్లల్లో మాత్రం మేమంతా ఒకే కుటుంబం రక్తసంబంధంలా అన్నదమ్ముల్లా ఒకే ఇంట్లో కలిసుంటామంటవ్..*

*🤷🏻‍♀ఇంటికి వేరువేరుగేట్లున్నా..పక్కింటివారితో ప్రతిరోజూ* *గొడవపడుతుంటావ్*
*🙋🏻‍♂గేటెడ్ కమ్యూనిటీల్లో మాత్రం ఒకే గేటున్నా మనకేం గట్ల పంచాయతనీ.. కలిసే..ఉందామంటవ్*

*🤷🏻‍♀తల్లిదండ్రులమీద వాట్సాప్ లో మెసేజ్ వస్తే కన్నీరు మున్నీరై కంటినిండా నీరు నింపుకుంటావ్*
*🙋🏻‍♂నీ సొంత తల్లిదండ్రులు.. రాక..రాక..నీ ఇంటికొస్తే కంటనీరింకేదాక ఏడిపించి పంపిస్తావ్*

*🤷🏻‍♀ఫేస్ బుక్  లో ఎవరైనా చనిపోయాడని మెసెజ్ వస్తే రిప్పులతో రఫ్ఫాడిస్తావ్*
*🙋🏻‍♂మరి కళ్ళముందే మనిషి ప్రాణంపోతుంటే అది కంటబడకుండా పనుందని పోయి అదే మెసెజ్ అందరికీ పంపి రిప్పులతో శ్రధ్ధాంజలి ఘటిస్థావు*

*🤷🏻‍♀ప్రాణాలు దక్కించుకునేందుకు కులమతాలెందుకు అంటావ్*
*🙋🏻‍♂కూలిపోయే ఇంట్లోకి మాత్రం కులమోడే రావాలంటావ్..*

*🤷🏻‍♀తిండికి లేని పేదోడ్ని చూడగానే వెక్కి వెక్కి ఏడుస్తావ్*
*🙋🏻‍♂నీ కంటి ముందు అన్నీ ఉన్నా.. తినలేక రోజంతా కన్నీటితో తడుస్తావ్..*

*🙆🏻‍♂కనీసం దానమివ్వరా అంటే మొఖమంతా మాడుస్తావ్..*

*🤷🏻‍♀ఫ్రెండ్స్ అప్పు అడిగితే డబ్బుతో స్నేహం దూరంచేసుకోలేనని నీతులు చెప్తావ్..*
*🙋🏻‍♂నువ్వు అడిగినపుడు వాళ్ళదే.. మాటంటే స్నేహానికి విలువే లేదంటావ్..*

*🤷🏻‍♀పక్కింట్లో గొడవైతే రోజంతా వారి గోడకే చెవులతికిస్తావ్*
*🙋🏻‍♂నీ ఇంట్లో గోలైతే గేటుదాకొచ్చినా గుండెలు బాదుకుంటావ్..*

*🤷🏻‍♀పరాయివాళ్ళకు  జరిగింది భారతమని బజారంతా బాజాలు వాయిస్తావ్..*
*🙋🏻‍♂నీకు జరిగింది మాత్రం రామాయణమని బహు రంజుగా టముకేస్తవ్..*

*🤷🏻‍♀గుడి ముందు అడుక్కునేవాడిని చూసి అసహ్యించుకుంటావ్*
*🙋🏻‍♂గుడిలోకెళ్ళి సిగ్గుపడకుండా నువ్వూ... అడుక్కుంటావ్*

*🤷🏻‍♀చచ్చినోడికి భగవధ్గీత క్యాసెట్ వేసి వినిపిస్తావ్..*
*🙋🏻‍♂బతుకున్నప్పుడు ఇది వినిపిస్తే కనీసం కొంతైనా మారతాడని మరుస్తావ్..*

*🤷🏻‍♀పెళ్ళి చేసి నువ్ ముందుండి మాదారిలోనే నడువమని డప్పులతో ఊరేగిస్తావ్...*
*🙋🏻‍♂చచ్చినోడి వెనకుండి నీ దారిలోనే నేననిఅదే డప్పులతో ఊరేగిస్తావ్..*

*🤷🏻‍♀ఈ లోకమెప్పుడు మారుతుందో అని మొసలి కన్నీరు కారుస్తావ్..*
*🙋🏻‍♂అదే లోకం లో నువ్ కూడా ఉన్నావని మరచి అందర్నీ ఆడిపోసుకుంటావ్..*

*💁🏻‍♂మీరు మారరా ఇంకా..!*
*🙅🏻‍♂మీరెందుకు మారతారు లే..*
*💁🏻ఈ లోకమే అంతా...!*

*🙇🏻కనీసం నేనైనా మారదామంటే నేనెలా మారను..*
*🤦🏻‍♂నేనూ ఈలోకంలోనే మాలోకంగా ఉన్నా కదా..*

Comments

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం