సమాజంలో మార్పులు
సమాజంలో మార్పులు🌸
ఓ ఆసక్తికరమైన విశ్లేషణ👇
1. గతంలో ఇంట్లో తిని బహిర్భూమి కోసం దూరంగా వెళ్లేవారు...
ఇప్పుడు బయట తిని, ఇంట్లోనే కానిచ్చేస్తున్నారు.
2. గతంలో మనుషులకు కాపలా కోసం బయట కుక్కల్ని పెట్టుకునేవారు...
ఇప్పడు ఇంట్లో కుక్కల్ని పెట్టుకుని బయట కాపలాగా మనుషుల్ని పెట్టుకుంటున్నారు.
3. గతంలో ఇంట్లో వాళ్లు వండితే బయటివాళ్లు వచ్చి తిని పోయేవాళ్లు...
ఇప్పుడు బయటివాళ్లు వచ్చి వండి పెడితే ఇంట్లోవాళ్లు తింటున్నారు.
4. గతంలో పెళ్లిళ్లు జరిగినప్పుడు బయటినుండి వచ్చినవాళ్లు ఆడి పాడితే ఇంట్లోవాళ్లు, బంధువులు చూసి ఆనందించేవారు...
ఇప్పుడు పెళ్లిళ్లలో సంగీత్ పేరిట ఇంట్లో వాళ్లు ఆడిపాడితే బయటివాళ్లు చూసి ఆనందిస్తున్నారు.
5. ఇది వరకు పిల్లలు పుట్టిన తర్వాత ముహూర్తాలు, జాతకాలు చూసేవారు...
ఇప్పుడు ముహూర్తాలు చూసుకుని సిజేరియన్ ద్వారా పిల్లలను కంటున్నారు.
6. ఒక్కప్పడు నీతులు స్కూల్ లో చెప్పేవారు ....ఇప్పుడు *whatsapp ,facebook* లో చెపుతున్నారు ....కానీ ...పాటించే వారు మాత్రం ఎవరు లేరు 😞😞
😜😜😜😜😜😜😜
Comments
Post a Comment