వ ని తా వందనాలు
*అ వ ని (త) వందనాలు*
ఆడ వారు ఆడవారు ఆడవారు
అంటూ ప్రతీ స్త్రీ ని తాను అడుగు పెట్టిన ఇంట సిరులు కురిపించు నంట అన్నట్లుగా స్త్రీ అనబడే అమ్మ తన చిట్టి తల్లిని చిన్నతనం నుండీ ఎంతలా మైండ్ సెట్ చేస్తుందో అలా కాకపోతే ఆ పిల్లని కట్టుకున్న మగాడి కుటుంబం ముక్క ముక్కలై పోవడం తథ్యం
ఏ సందేహం లేదు.
అందుకే గతంలో అప్ప గింతలప్పుడు ఆ వధువు తల్లి తండ్రులు ఇక నుండి నీకంతా నీ అత్తరిల్లే అమ్మా.
అంటూ పంపిస్తారు.
ఎంత గొప్ప సాంప్రదాయమో
మనది.
మహిళ పాత్ర ప్రాముఖ్యతను
వెల్లడించడం ఏ అక్షరానికీ సాధ్యం
కాదు అన్న మీ మాటలు ఆణి ముత్యాలే.
ఈగో లేకుండా చెప్పాలంటే
స్త్రీ మూర్తి లేనిదే మగాడికి సుఖం
లేదు,శాంతి లేదు,సమాజంలో గౌరవం లేదు.
మగాళ్ళ కోసం మర యంత్రాల్లా మన స్ఫూర్తిగా పని చేస్తున్న మహిళలే మహా రాణులు.
సృష్టిని నిరాటంకంగా నడపడానికి పరిశ్రమించే శ్రామికురాలు స్త్రీ
తన పనితనం ఇతరులెరుగకున్నా
తన కష్టాలను ఇల్లు దాటనీయక
తన బాధను పెదవి దాటనీయక
తన వివక్షతను గుప్తంగా దాచే ఉత్తమ ఇల్లాలు స్త్రీ
నిద్రలేచినప్పటినుండీ
నిద్రపోయేవరకూ
నిరంతర యంత్రంలా పనిచేసే
ఒకేఒక ఉత్తమజీవి స్త్రీ
బిడ్డకు జన్మనివ్వడానికి
కడుపున పడ్డప్పటి నుండీ
ప్రసవించేవరకూ శతకోటి
శ్రమలు పడే సహనశీలి స్త్రీ
భర్త ఎలాంటివాడైనా,
అనుమానించినా,
అవమానించినా,
అగౌరవపరచినా,
అన్యాయంచేసినా,
అష్టకష్టాలపాలు చేసినా,
అమాయకంగా సబలయైనా,
అబలగా వుండి
అత్తగారి ఆరళ్ళు భరించి
ఆడపడచు అవమానాలకు ఓర్చి
తాళి అనే మూడు ముళ్ళ బంధాన్ని
పెళ్ళి అనే ఏడడుగులతో
తన ఇష్టాలు,కోరికలను
మగడికి అర్పణం చేసి వంశోద్ధరణచేసే
ఉత్తమ పతీవ్రత స్త్రీ
నేడు స్త్రీలేని రంగంలేదు
స్త్రీ చేయలేని పనిలేదు
మగాడితో సమానంగా సంపాదన
మగాడికంటే అధిక పనిమంతురాలు స్త్రీ
అందుకేనేమో దేవుళ్ళు సైతం
బ్రహ్మ సరస్వతిని *నాలుక*పై
విష్ణువు *హృదయం*లోనూ
ఈశ్వరుడు తన *అర్థనారీ*గా
ఆదరించారంటే స్త్రీ గొప్పతనం తెలుస్తోంది
జయహో స్త్రీ జయహో.
Comments
Post a Comment