కామన్ సెన్స్
కామన్ సెన్స్..
----------------
నువ్వు ఫోన్ మాట్లాడితే.. పక్కవాళ్ళకు డిస్ట్రబ్ కాకూడదు!
నువ్వు బండి నడిపితే.. రోడ్డుపై ప్రయాణం చేసేవారు భయపడకూడదు!
నువ్వు తినేటప్పుడు.. పక్కకు కూర్చున్నవాళ్ళు నిన్ను చూసి చీదరించుకోకూడదు!
నువ్వు మాట్లాడితే.. ఎదుటివాళ్ళు ఎప్పుడు ఆపుతావో అని ఎదురుచూడొద్దు!
నువ్వు రాసింది.. చదివేవాళ్ళు అర్ధంచేసుకోవడానికి జుట్టు పీక్కోవద్దు!
నువ్వు ధియేటర్ కు వెళ్ళినప్పుడు.. నీ ప్రవర్తన ఇతర ప్రేక్షకులకు భంగం కలిగించకూడదు!
నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటావననే నమ్మకాని ఎదుటివారికి కలిగించాలి!
నువ్వు పేసు బుక్ లో పోస్టు పెడితే.. ఏ ఒక్కరికైనా ఉపయోగపడాలి!
నువ్వు వాట్స్ ఆప్ లో ఏదైనా పంపిస్తే.. ఏదైనా కొత్త విషయమై ఉండాలి!
ఎక్కడైనా.. ఎప్పుడైనా.. నీవల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు.
అదే.. కామన్ సెన్స్ అంటే!
Comments
Post a Comment