ఇవ్వడం...పుచ్చుకోవడం

అనగనగా ఒక రాజు. ఒక రోజు ఓ కవి రాజు ఆస్థానానికి వచ్చాడు. రాజు గారికి ఓ మంచి కవితను వినిపించాడు. రాజు చాల సంతోశపడి, అతనికి కొన్ని బంగారు నాణేలు ప్రకటించాడు. ఆ కవి ఇంకో కవితను వినిపించాడు. ఆ రాజు చాల సంతోష పడీ జాగీరు ప్రకటించాడు. ఆ కవి మహాశయుడు పులకించిపోయి, ఇంకా మంచి పద్యాన్ని వినిపించాడు. రాజు ఆనందవిభోరుడయి, కానుకగా వజ్రాలను ప్రకటించాడు. ఆ కవి ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆనందం తో ఇంటికి వెళ్లి భార్య,పిల్లలకు విషయాన్నీ చెప్పాడు. అందరు మురిసి పోయారు. ఒక రోజు, రెండ్రోజులు, వారం గడిచి పోయింది. రాజు కానుకలు రాలేదాయే. ఒక రోజు ఆ కవి మహారాజు రాజు గారి ఆస్థానానికి వెళ్లి తెలుసుకుందామని బయలు దేరాడు. రాజు వద్దకు వెళ్లి నాకు ఇంత వరకు ఎటువంటి కానుకలు , మీరు ప్రకటించిన నజరాణాలు అందలేదు మహారాజ అని అడిగాడు. ఏమంటివి కానుకలా, అని రాజు నీవు నాకు పద్యాలు వినిపించావు, నా చెవులకు ఆనందం కలిగింది. నేను నీకు ఇఛ్చినా వరాలు నీకు ఆనందం కలిగించాయా, లేదా ? అని అడిగాడు. కవి అవును మహారాజ, అని బదులు చెప్పాడు. ఐతే, ఇందులో ఇవ్వడం పుచ్చుకోవడం ఎక్కడిది. నువ్వు పాడావు నేను సంతోషించా, నేను కానుకలు ప్రకటించాను నీవు సంతోషించావు అయి పోయింది అని రాజు ఆ కవిని ఆస్థానం నుండి గెంటేశాడు.

Comments

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం