వేసవి తాపానికి మంచి చిట్కా

వేసవి తాపానికి మంచి చిట్కా*
*మజ్జిగ వాడకం*

*◆ ప్రాచీన భారతంలో - మజ్జిగ వాడకం.*
          
ఒకనాడు మన తెలుగు నాట ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు , గేదెలు పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్న ఇంటి నిండా ,కుండల నిండా ఎంత పెరుగు ఉన్న *ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు వాడేవారు కాదు.* ప్రతి రోజూ ఉదయాన్నే ఆ పెరుగు ను చిలికీ పూర్తిగా వెన్న తీసి తగినన్ని మంచి నీరు కలిపి పలుచని తీయని మజ్జిగ తయారు చేసుకొని ఆహరంలో ఉపయోగించేవారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే .

       _కాని కమ్మని గడ్డ పెరుగు ను వదిలి పెట్టి పలుచని నీరు వంటి మజ్జిగ ను తాగడం లో ఉన్న ఆంతర్యము ఏమిటో మనకు తెలియదు._

      *ఈనాడు ఆ ఆంతర్యం గురించి తెలుసుకుందాం .*

◆ _*ఆధునిక భారతం లో - పెరుగు వాడకం*_
           ఈనాడు దాదాపు నూటికి 90% మంది ప్రజలు తమ ఆహారం లో మజ్జిగ ను పూర్తిగా మానేశారు. *రోజూ రెండు పూటలా పెరుగు ను మాత్రమే వాడుతున్నారు.* పెరుగు ను చిలికి వెన్న తీసి మజ్జిగ ను తయారు చేయడానికి కొంత సమయం వెచ్చించాలి . కాబట్టి ఆ విధంగా సమయం వృధా చేయకుండా అన్నము లో పెరుగు ను కలుపుకొని తినడమే గొప్ప నాగరికత అని ఈనాడు అంతా మురిసి పోతున్నారు. అయితే *పెరుగు ఆయుక్షిణం. ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు వాడకూడదు.* అలా ~వాడితే ఉదరంలో వాయువు ఎక్కువ అయ్యి అనేక వాత రోగాలు వస్తాయని ఆయుర్వేద మహర్షులు~ మనకు నిక్కచ్చిగా తేల్చి ఏనాడో చెప్పారు. అయినా రోజూ రోజుకు కష్టపడి పని చేసే స్వభావం కోల్పోతు బద్ధకస్తులుగా మారుతున్న నేటి గృహిణులు మజ్జిగ ను తయారు చేసి వాడడం కన్నా పెరుగు ను వాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

            *మజ్జిగ లో రకాలు*

◆ _*1. మధితము అనే మజ్జిగ*_
            
పేరుకొన్న పాలల్లో నీరు కలపకుండా చిలికి తయారు చేసిన మజ్జిగ ను మధిత మజ్జిగ అంటారు . ఇది చిక్కగా జిడ్డు గా ఉంటుంది ఈ మజ్జిగ ను ఆహారం లో వాడుతూ ఉంటే నీరసం , ఉదర రోగాలు పైత్యము వల్ల కలిగిన వాతము నాలుక కు రుచి తెలియక పోవడం , మూత్రము ఆగిపోవడం , నీళ్ళ విరోచనాలు మొదలైనవి హరించి పోయి శరీరానికి మంచి బలం కలుగుతుంది . ఈ రకమైన మజ్జిగ ను మన రెండు రాష్ట్రాల ప్రజలు గ్రిష్మ, శరత్, హేమంత, శిశిర రుతువులలో సేవించి ఆరోగ్యం పొందవచ్చు.

◆ _*2. మిళితమను మజ్జిగ*_
             
పెరుగు ఒక వంతు నీళ్లు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసిన మజ్జిగ మిళిత మజ్జిగ అనబడుతుంది. ఇది శరీరం లో పైత్యాన్ని అరుచిని అతిసార విరోచనాన్ని రక్తం లో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను పోగొడుతుంది. ఈ మజ్జిగ అన్ని కాలాలలో తీసుకోవచ్చు శ్రేష్ఠమైనది.

◆ _*3. గోళము అను మజ్జిగ*_
            
ఒక వంతు పెరుగు ఒకటిన్నర వంతు నీళ్లు కలిపి తయారు చేసినది. ఈ విధమైన మజ్జిగ వాడుతుంటే వీర్య వృద్ధి కలిగి శరీరానికి మంచి కాంతి వస్తుంది . కంటికి మంచి మేలు చేస్తుంది . ఉదరము లో మందాగ్ని విష దోషాలు మేహము ప్రమేహము కఫ రోగము ఆమ రోగము పోగొడుతుంది . ఈ రకమైన మజ్జిగ గ్రీష్మ, వర్షం రుతువులయందు తీసుకోవాలి .

◆ _*4. షాడభము అను మజ్జిగ*_
              
ఒకవంతు పెరుగు అయిదు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసింది . ఇది శ్లేష్మ రోగాలను , గుల్మ రోగాలను , రక్త మూల వ్యాధి ని పోగొడుతుంది. తేలికగా ఉండి ఉదరములో జఠరాగ్నిని పెంచి శరీరానికి కాంతి ఇస్తుంది.

◆ _*5. కాలశేయము అను మజ్జిగ*_
            
ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసింది . ఈ మజ్జిగ బంకా విరోచనాలు , విషములను, ఉబ్బులను, మంటను, వాతమును, మూల వ్యాధిని పోగొట్టి శరీరం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది. ఇప్పటికే పడిన ముడతలను కూడా తీసి వేస్తుంది .

Comments

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం