ఆచారాలు ---- విచక్షణ
ఒక రూమ్ లో ఎనిమిది కోతులను ఉంచారు .
.
. ఆ రూమ్ మధ్యలో సీలింగ్ కి ఉన్న కొక్కేనికి ఒక అరటి పళ్ళ గెలను వేలాడదీశారు . దాన్ని చేరుకోడానికి వీలుగా ఒక నిచ్చెన ఏర్పాటు చేశారు .
.
.
ఏదైనా ఒక కోతి అరటి పండుకోసం నిచ్చెన ఎక్కగానే మిగిలిన ఏడూ కోతుల మీదా చల్లటి ఐసు నీళ్ళు పోసేవారు . అవి తట్టుకోలేకపోయేవి . వణికి పోయేవి .
.
మొదట్లో వాటికి అర్ధం కాలేదు . కానీ అవి గ్రహించాయి . కొద్దిసేపు తర్వాత ఏదైనా ఒక కోతి అరటిపళ్ళ కోసం ఎక్కబోతూ ఉంటె మిగిలినవి దానిని పట్టుకుని ఎక్కకుండా చితక బాదేసేవి . వాటికి నీళ్ళ బాధ తప్పింది . అలా ఆ గదిలో అరటి పళ్ళు , నిచ్చెన , కోతులూ ముఖ ముఖాలు చూసుకుంటూ గడుపుతూ ఉండగా నిర్వాహకులు అన్బ్డులో నుండి ఒక కోతిని తీసేశారు .
.
.
దాని బదులుగా ఒక కొత్త కోతిని గదిలోకి పెట్టారు . రాగానే కొత్త కోతి అరటిపళ్ళ కోసం వెడుతూ ఉంటె మిగిలిన ఏడూ కోతులూ రాబోయే ప్రమాదం గ్రహించి దాన్ని పట్టుకుని చితక బాది కూర్చోబెట్టాయి . విచిత్రం ఏమిటి అంటే నిర్వాహకులు ఈ సారి నీళ్ళు కొట్టకుండానే అవి దానిని ఎక్కనివ్వలేదు .
.
.
కొంత సేపు పోయాక పాత కోతులు ఏడింటిలో ఒక దానిని తీసేసి కొత్త కోతిని ప్రవేశ పెట్టారు . అది అరటిపళ్ళ కోసం ఎక్కబోతోంది . వెంటనే పసి గట్టాయి మిగిలిన కోతులు . ఎక్కడ నీళ్ళు వచ్చి పడిపోతాయో అని భయపడుతూ ఎగిరి దానిమీదకు దూకి దాన్ని కుమ్మేసి కూర్చోబెట్టాయి. ఈ చర్యలో దెబ్బ తిన్న ఇందాక వచ్చిన కోతి కూడా కొత్త కోతిని కుమ్మేసింది ( ఎందుకు కుమ్ముతున్నానో నాకే తెలియదు అనుకుంటూ ) నీరు చిమ్మబడక పూర్వమే అవి అలా చేశాయి .
.
.
.
అలా మిగిలిన ఆరు కోతుల స్థానం లో ఆరు కొత్త కోతులు వచ్చాయి . వాటి మీద నీళ్ళు చిమ్మనే లేదు . అయినా అవి అరటిపళ్ళ కోసం ప్రయత్నం చెయ్యబోయిన కొత్త కోతులను ఆపేశాయి .
.
.
మితృలారా !
.
గమనించండి . మన ఆచారాలూ , విశ్వాసాలూ ఇలాగే ఏర్పడ్డాయి .
.
ఆచరించబడుతున్నాయి .
.
కొనసాగుతున్నాయి .
.
ముందు వాళ్ళు చేశారు ...
.
మనమూ చేస్తున్నాము ...
.
అప్పటి వారు రూపొందించుకున్న ఆచారాలు ఆనాటి కాలమాన పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకూ కూడా వర్తించనూ వచ్చు , వర్తించక పోవచ్చు
.
మన విచక్షణ మనం ఉపయోగిద్దాం !
.
మంచిని ఎక్కడినుండైనా తీసుకుందాం !
.
చెడు ఎక్కడ ఉన్నా విసర్జిద్దాం !
Comments
Post a Comment