అనునాసిక ద్వ్యక్షర కందము(పద్యం)

అనునాసిక ద్వ్యక్షర కందము
======================
మనమే మనమని మనమన
మనుమని మనుమని మనుమని మననమ్మేనా?
మన మేనమామ మామను
మునునేమిన మౌనిమౌని మోమున మనుమా!

మనమే = మనం అందరమూ,

మనమని = శాశ్వతం కాదని,

మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా,

మనుమని మనుమని మనుమని =
పౌత్రునకు పౌత్రునకుృ పౌత్రుని (తన తర్వాత తరాల (7 తరాలు) గురించి)

మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా?  (కాదు),

మన మేనమామ =మన మేన మామ అయిన చంద్రుడికి,

మామను  =  మామగారైన దక్షప్రజాప్రతిని,

మును+నేమిన = పూర్వం శిక్షించిన,

మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని , 
మోమున = ముఖస్థముగా,
మనుమా! = జీవించుట  మేలు!!

అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!

Comments

  1. ఇది మా తాతగారు బ్రహ్మశ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి పద్యం....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

తల్లిదండ్రులను ద్వేషించకండి!

సాపాటు--గ్రహపాటు

ముఖ్యమైన సందేశం